రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

20 Jun, 2023 16:40 IST

తాడేప‌ల్లి: రాష్ట్రప‌తి శ్రీమతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ఆయురారోగ్యాల‌తో ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని, యావత్ భార‌త‌ జాతికి నిజమైన స్ఫూర్తి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.