బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోండి
16 Mar, 2023 10:37 IST
అసెంబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 2023–24 వార్షిక బడ్జెట్ను ప్రజలంతా ఆసక్తిగా చూస్తారని, అలాంటి బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్పీకర్ను కోరారు. బడ్జెట్ ప్రసంగం ప్రజలకు వినపడకూడదనే కుతంత్రంతో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు శాసనసభలో గందరగోళం సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. బడ్జెట్ ప్రతిపక్ష సభ్యులకు కష్టంగా ఉంటే, ప్రసంగం వినాలని లేనప్పుడు వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు. సభా సజావుగా జరగేలా, ప్రజలకు రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం వివరంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ కోరారు.