`అమరజీవి`కి సీఎం వైయస్ జగన్ నివాళి
16 Mar, 2022 11:37 IST
తాడేపల్లి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ఆర్యవైశ్య నేతలు పాల్గొన్నారు.