అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం

1 May, 2022 20:07 IST

 
తాడేప‌ల్లి: నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. ‘మే’డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మెహన్‌రెడ్డి.. కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు.’’ అని సీఎం వైయ‌స్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.