మహిళల సంక్షేమం కోరుకోవడమే రక్షా బంధన్ స్ఫూర్తి
3 Aug, 2020 10:10 IST
తాడేపల్లి: మహిళల సంక్షేమం కోరుకోవడమే రక్షా బంధన్ స్ఫూర్తి అని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సోదర సోదరీమణుల మధ్య బంధాన్ని ప్రతిబింబించే పండుగని పేర్కొన్నారు. మహిళలను రక్షించాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించడం, వారి సంక్షేమం కోరుకోవడమే ఈ పండుగ స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు.