రేపు సీఎం వైయస్ జగన్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పర్యటన
18 Mar, 2023 14:57 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం (19.03.2023) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆదివారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరు చేరుకుంటారు. 11.00 – 12.30 గంటలకు మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.