రేపు కొవ్వూరులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

23 May, 2023 17:52 IST

తూర్పు గోదావ‌రి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం (24.05.2023)  తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నగదు జమచేయనున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కొవ్వూరు చేరుకుంటారు. అక్కడ సత్యవతినగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగం అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్న సీఎం, కార్యక్రమం అనంతరం కొవ్వూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.