రేపు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం వైయస్ జగన్
11 Feb, 2020 19:37 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం) మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం వైయస్ జగన్ ఢిల్లీ బయల్దేరుతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, పెండింగ్ బిల్లులు, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు తగిన కేటాయింపులు జరపని విషయాన్ని ప్రధానితో సీఎం వైయస్ జగన్ చర్చించనున్నారు.