రేపు సీఎం వైయస్ జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటన
22 Jan, 2024 10:49 IST
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (23.01.2024) అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. వైయస్ఆర్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ఉరవకొండలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు, ఆ తర్వాత వైయస్ఆర్ ఆసరా నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.