కాసేపట్లో దాకమర్రికి సీఎం వైయస్ జగన్
14 Dec, 2022 15:22 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయల్దేరారు. కాసేపట్లో విశాఖ జిల్లా దాకమర్రి చేరుకుంటారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించనున్నారు. అనంతరం విశాఖ నుంచి బయల్దేరతారు. సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు.