నేడు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో పాల్గొననున్న సీఎం వైయస్ జగన్
ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. నిన్న రాత్రి గన్నవరం నుంచి ఢిల్లీకి చేరుకున్న సీఎం వైయస్ జగన్.. ఢిల్లీలోని జన్‌పథ్ నివాసంలో బస చేశారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పలువురు అధికారుల బృందం సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్ కార్యక్రమాల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొనున్నారు. కాగా, ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం వైయస్ జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.