రేపు ప్రధాని మోదీతో సీఎం వైయస్ జగన్ భేటీ
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు సీఎం వూమపః జగన్. ఈ రాత్రి 1, జన్‌పథ్ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు. అపాయింట్‌మెంట్ షెడ్యూల్ ప్రకారం రేపు(శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం వైయస్ జగన్ సమావేశం కానున్నారు .
ప్రధాని మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్చించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల
పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు
పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు సంబంధించిన ఆమోదం
కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలతో పాటు పెండింగ్ అంశాల పరిశీలన
2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్
కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు
జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఎక్కువ కవరేజీ
ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా
ఈ వాటా లభిస్తే.. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం
విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు
కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం
APMDC కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు
ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్