ఈనెల 11న గుంటూరుకు సీఎం వైయస్ జగన్
9 Nov, 2021 12:34 IST
గుంటూరు: ఈనెల 11వ తేదీన గుంటూరు మెడికల్ కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో జరగనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130వ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను హోం మంత్రి మేకతోటి సుచరిత, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా పరిశీలించారు. వేదిక, కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి విషయాలపై అధికారులతో చర్చించారు.