రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన సీఎం వైయస్‌ జగన్‌

24 Nov, 2020 11:04 IST

తిరుపతి: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. తిరుపతి పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో తిరుచానూరు పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా ఘనస్వాగతం పలికారు.