శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్
19 Sep, 2023 10:34 IST
తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. పద్మావతి అతిథి గృహం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు మహాద్వారం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం శ్రీరంగనాయకుల మండపానికి సీఎం వైయస్ జగన్ చేరుకున్నారు. శ్రీరంగనాయకులు మండపంలో సీఎం వైయస్ జగన్‌కు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందజేశారు. సీఎం వెంట డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్.కే.రోజా, ఎమ్మెల్సీ భరత్, ఈవో ధర్మారెడ్డి ఉన్నారు.