రేపు సీఎం వైయ‌స్ జగన్‌ విజయవాడ పర్యటన

28 Sep, 2023 10:40 IST

తాడేప‌ల్లి: సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఈ నెల 29న (శుక్ర‌వారం) విజయ­వాడలో పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్‌లో  వైయ‌స్ఆర్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు. బహిరంగ సభలో ప్రసంగించి తాడేపల్లికి చేరుకుంటారు.