నేడు తిరువూరులో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన

19 Mar, 2023 09:55 IST

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లిలోని త‌న‌ నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్‌ కళాశాలకు చేరుకుంటారు. 11 గంటల నుంచి 12.30 గంటల వరకు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. అనంతరం విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్య‌క్ర‌మం అనంత‌రం తిరిగి తాడేపల్లి త‌న నివాసానికి చేరుకుంటారు.