నేడు ఇంద్రకీలాద్రికి సీఎం వైయస్ జగన్
12 Oct, 2021 12:00 IST
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు దర్శించుకోనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మూలానక్షత్రం (అమ్మవారి జన్మనక్షత్రం) రోజున దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం రోజున ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైయస్ జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం అమ్మవారి చరిత్రను తెలిపే ఆగ్మెంటెడ్ రియాల్టీ షోను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.