నేడు భీమవరంలో సీఎం వైయస్ జగన్ పర్యటన
13 Feb, 2020 12:00 IST
ఏలూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3:40 గంటలకు సీఎం వైయస్ జగన్ తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి భీమవరం చేరుకుంటారు. భీమవరంలోని వీఎస్‌ఎస్ గార్డెన్‌లో జరిగే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. భీమవరం నుంచి సాయంత్రం 4.55 గంటలకు బయల్దేరి 5.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం వైయస్ జగన్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నతాధికారులు, నాయకులు ఏర్పాట్లను పూర్తిచేశారు.