కాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
30 Mar, 2020 11:09 IST
తాడేపల్లి: మరికాసేపట్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్షించనున్నారు. లాక్‌డౌన్ అమలు, నిత్యావసరాలు, రేషన్ సరఫరాపై అధికారులతో చర్చించనున్నారు. అంతేకాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దు తీసుకుంటున్న చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్షించనున్నారు.