రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, క్షేమంగా ఉండాలి
తాడేపల్లి: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగింపు ‘అఖండ పూర్ణాహుతి’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. యజ్ఞం ముగింపు అనంతరం సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
‘‘ఆరు రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగిన చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నేడు పూర్ణాహుతితో ముగిసింది. వేలాది మంది ఈ యజ్ఞంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రార్థించారు. ప్రజలు నాపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి నేను కృతజ్ఞుడిని. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేందుకు కృషిచేద్దాం. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.