పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదు
29 Aug, 2023 10:34 IST
తాడేపల్లి: తల్లిదండ్రుల పేదరికం పిల్లల చదువులకు అడ్డుకాకూడదన్న సంకల్పంతో మన ప్రభుత్వంలో జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. అనంతరం విద్యా దీవెన పథకం సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత విద్యలు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏ త్రైమాసికానికి సంబంధించిన ఫీజును ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే వారి తల్లుల ఖాతాల్లోకి రీయింబర్స్ చేస్తున్నామని చెప్పారు. ఈ నాలుగేళ్ళ కాలంలో ఈ పథకం కింద 24,53,389 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.11,317 కోట్లను జమచేశామని వివరించారు.