రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యక్రమం
తాడేపల్లి: ఎన్నో అవరోధాలు, అడ్డంకులను అధిగమించి రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని సీఎం అన్నారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు, ఇళ్ళు ఇవ్వకూడదంటూ పెత్తందారులు, ఊరూపేరూ లేని సంఘాలు సుప్రీంకోర్టు వరకూ వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, దేవుడి దయతో మన ప్రభుత్వం వారిపై విజయం సాధించి ఇక్కడ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడంతో పాటు, నేడు ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పెత్తందారులపై పేదవారు సాధించిన విజయంగా ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది`` అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.