చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి
24 Oct, 2023 08:35 IST
తాడేపల్లి: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. అదే స్ఫూర్తితో మీరు కూడా విజయాలు సాధించాలని..ఆ దుర్గాదేవి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...తెలుగు వారందరికీ విజయ దశమి శుభాకాంక్షలు అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.