వనిత జీవితం మనకు ఆదర్శం
8 Mar, 2023 19:03 IST
తాడేపల్లి: జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని, తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన వనిత గారి జీవితం మనకు ఆదర్శం అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. వనిత గారికి, మరియు రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్లో సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.