జగదీప్ ధన్‌ఖడ్‌కు సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు
7 Aug, 2022 10:07 IST
న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌ఖడ్‌కు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలో జగదీప్ ధన్‌ఖడ్ ఘన విజయం సాధించడం పట్ల వైయస్ జగన్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.