వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం
12 Jan, 2022 11:28 IST
తాడేపల్లి: వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శణీయమని ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భం సీఎం వైయస్ జగన్ ఘన నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.