హ్యాపీ ఉమెన్స్‌ డే  

8 Mar, 2020 19:40 IST

 
   అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమెన్స్‌ డేను పురష్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నతిని సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి  దిశగా పయనిస్తుంది. అమ్మఒడి నుండి పేదలకు ఇళ్ల పట్టాల వరకు.. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అంతిమంగా మహిళా సాధికారతకు తోడ్పడుతున్నందుకు సంతోషంగా ఉంద’ని ట్విటర్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు.