ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్
4 Mar, 2020 11:22 IST
అమరావతి: ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివితే... మంచి ఫలితాలు సాధించగలరని వారిలో స్ఫూర్తి నింపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 10,65,156 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.