రంగా చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం

26 Dec, 2019 11:14 IST

తాడేపల్లి: సీఎం క్యాంపు కార్యాలయంలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రంగా చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు నేతలు వంగవీటి రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.