గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం వైపు అడుగులు వేస్తూ..
2 Oct, 2021 09:44 IST
తాడేపల్లి: నేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో రెండేళ్ల కిందటే అడుగులు పడ్డాయని అన్నారు. నేటి నుంచి `క్లీన్ ఆంధ్రప్రదేశ్`కు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మహాత్ముడి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.