వ‌ర‌ద బాధితులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి

27 Jul, 2022 11:54 IST

అల్లూరి జిల్లా: వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు పర్యటన మొదలైంది. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ నుంచి ఆయన బయలుదేరారు. కొద్దిసేప‌టి క్రిత‌మే అల్లూరి జిల్లా చింతూరు మండలం కొయుగురు గ్రామంలో వరద బాధితులతో సీఎం వైయ‌స్ జగన్‌ ముఖాముఖి నిర్వ‌హిస్తున్నారు.  బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి నేరుగా వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకుంటున్నారు.