కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం వైయస్ జగన్
30 Nov, 2022 15:01 IST
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనలో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మదనపల్లె పర్యటనలో భాగంగా బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్లేందుకు సీఎం కాన్వాయ్ బయల్దేరింది. అప్పటికే రోడ్డుకు ఇరువైపులా ప్రజలు, వైయస్ఆర్ సీపీ అభిమానులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులతో రోడ్డు కిక్కిరిసిపోయింది. అంత హడావుడిలోనూ ఓ అంబులెన్స్ రాకను గమనించిన సీఎం వైయస్ జగన్.. దానికి దారి ఇవ్వాలంటూ అధికారులకు సూచించారు. సీఎం కాన్వాయ్ బస్సుని పక్కన ఆపించి అంబులెన్సుకు దారిచ్చారు. ఆ సమయంలో అంబులెన్స్ నుంచి పేషెంట్ బంధువులు చేతులెత్తి సీఎం వైయస్ జగన్‌కు నమస్కరించారు.