వైయస్ఆర్ జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం
30 Nov, 2023 13:21 IST
నంద్యాల: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల జిల్లా పర్యటన ముగించుకొని వైయస్ఆర్ కడప జిల్లా పర్యటనకు బయల్దేరారు. నంద్యాల జిల్లాలో అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన అనంతరం.. అక్కడి నుంచి వైయస్ఆర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. కడపలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అమీన్‌పీర్ దర్గా (పెద్దదర్గా) ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తిరిగి సాయంత్రానికి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు.