విశాఖకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం చేరుకున్న సీఎం వైయస్ జగన్.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయల్దేరారు. విశాఖలో రేపు, ఎల్లుండి (శుక్ర, శనివారాల్లో) గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను సీఎం వైయస్ జగన్ రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.
3వ తేదీ షెడ్యూల్
ఉదయం 9.10 గంటలకు సీఎం వైయస్ జగన్ ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఉదయం 10గంటలకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో ఎంజీఎం పార్క్ హోటల్‌లో జీఐఎస్ డెలిగేట్స్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు.
4వ తేదీ షెడ్యూల్
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.