ఉరవకొండ పర్యటనకు బ‌య‌ల్దేరిన సీఎం

23 Jan, 2024 11:07 IST

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. మ‌రికాసేప‌ట్లో వైయ‌స్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని సీఎం వైయ‌స్‌ జగన్ లాంఛ‌నంగా ప్రారంభించి.. డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేస్తారు. ఉద‌యం తాడేపల్లిలోని త‌న‌ నివాసం నుంచి బయల్దేరిన సీఎం.. మ‌రికాసేప‌ట్లో ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంత‌రం వైయ‌స్సార్‌ ఆసరా నాలుగో విడత కింద బటన్‌ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు.