నిడదవోలు పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
1 Mar, 2023 10:58 IST
తాడేపల్లి: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో నిడదవోలు పర్యటనకు సీఎం బయల్దేరారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించనున్నారు.