ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
29 Mar, 2023 16:16 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న సీఎం వైయస్ జగన్.. గన్నవరం నుంచి ఢిల్లీ బయల్దేరారు. రాత్రి 9:30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో సీఎం వైయస్ జగన్ చర్చించనున్నారు.