ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
16 Mar, 2023 17:50 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సాయంత్రం 4.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. రాత్రి 7.15 గంటలకు సీఎం వైయస్ జగన్ ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో 1-జన్‌పథ్‌లో తన అధికారిక నివాసంలో బస చేస్తారు. రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.