విశాఖపట్నం బయల్దేరిన సీఎం వైయస్ జగన్
13 Feb, 2024 16:20 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు బయల్దేరారు. 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల ముగింపు వేడుకలకు సీఎం వైయస్ జగన్ హాజరుకానున్నారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్ కాసేపట్లో విశాఖకు చేరుకుంటారు. విశాఖ పీఎం పాలెంలోని వైయస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న `ఆడుదాం ఆంధ్రా` క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు. ప్రసంగం అనంతరం ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు.