తిరుమలకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
27 Sep, 2022 15:04 IST
తాడేపల్లి: శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరి వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుంటారు. సాయంత్రం 5.20 గంటలకు తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత అలిపిరి చేరుకొని తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులను సీఎం ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు తిరుమలలోని బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం వైయస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.