అనంతపురం పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
26 Apr, 2023 10:38 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా శింగనమల పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్ మరికాసేపట్లో శింగనమల నియోజకవర్గం నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. నార్పల క్రాస్‌రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న వసతి దీవెన కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. తిరిగి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.