ఏపీకి మరిన్ని కోవిడ్ డోసులు పంపించండి
23 Apr, 2021 16:45 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను తీర్చే విధంగా మరిన్ని కోవిడ్ డోసులను పంపించాలని భారత్ బయోటెక్, హెటిరో డ్రగ్స్ ఎండీలను సీఎం వైయస్ జగన్ కోరారు. భారత్ బయోటెక్, హెటిరో డ్రగ్స్ ఎండీలతో సీఎం వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రానికి మరిన్ని డోసులు పంపించాలని కోరారు. అదే విధంగా రెమిడెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేయాలన్నారు.