దేవకి ఘటనపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి
8 Oct, 2022 20:58 IST
తాడేపల్లి: కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడ గ్రామంలో హత్యకు గురైన దేవకి ఘటనపై సీఎం శ్రీ వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిశ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సీఎం ఆదేశించారు. చట్టంలో పేర్కొన్న విధంగా త్వరతిగతిన కేసు విచారణ పూర్తిచేసి, నిర్ణీత సమయంలోగా ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెడ్ హేండెడ్‌గా పట్టుబడ్డ కేసుల విషయంలో దిశ చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ముందుకుసాగాలన్న సీఎం. తద్వారా నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి తోడుగా నిలవాలంటూ అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.