సంక్రాంతి వేళ అందరికీ మంచి జరగాలి
15 Jan, 2021 12:32 IST
గుంటూరు: నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపూజ చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ..అందరికీ సంక్రాంతి వేళ మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నరసరావుపేట గోపూజ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, ఏఈవో. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకూరి శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు .