భారత రాజ్యాంగం మనల్ని బలోపేతం చేస్తోంది
26 Nov, 2019 14:12 IST
తాడేపల్లి: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ నేతృత్వంలో గొప్ప వ్యక్తులు ప్రసాదించిన భారత రాజ్యాంగం మనల్ని బలోపేతం చేస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సీఎం వైయస్ జగన్ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగ సూత్రాల ప్రామాణికంగా అందరికీ రాజకీయ, సామాజికార్థిక న్యాయం జరిగేందుకు కట్టుబడాలని, ఈ సందర్భంగా మనమంతా ప్రతినబూనాలని సీఎం వైయస్ జగన్ పిలుపునిచ్చారు.