రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
21 Apr, 2021 10:17 IST
తాడేపల్లి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. `సత్యం, ధర్మం, న్యాయమే మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుడు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనకు ఆదర్శప్రాయుడు. పుణ్య దంపతులు సీతారాముల కళ్యాణం ఈ లోకానికి పండుగ రోజు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు` తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.