‘స్పందన’పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
5 Jan, 2021 12:45 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన 'స్పందన' కార్యక్రమం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సీఎం వైయస్ జగన్ పలు విషయాలపై సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రగతిపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైయస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలపై, రహదారుల కోసం భూసేకరణపై సీఎం సమీక్షించనున్నారు. ఆర్‌బీకేల పరిధిలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు కోసం స్థల సేకరణపై, అమ్మఒడి, రేషన్ డోర్ డెలివరీ వాహనాల అందుబాటుపై సీఎం వైయస్ జగన్ చర్చించనున్నారు.