`సదరన్ జోనల్ కౌన్సిల్` అజెండాపై సీఎం సమీక్ష
29 Aug, 2022 14:54 IST
తాడేపల్లి: సెప్టెంబర్ నెలలో కేరళలో జరగనున్న 30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య,పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు.