రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై సీఎం సమీక్ష
21 Jun, 2022 12:59 IST
తాడేపల్లి: రహదారుల మరమ్మతులు, నిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్ణణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఎం. టీ. కృష్ణబాబు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె. వి. వి. సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.